నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : అభ్యర్థులకు ఫ్రీగా గ్రాండ్ టెస్టులు

తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రీపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్‌-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ ఉచితంగా ఆన్‌లైన్‌ గ్రాండ్‌ టెస్టులు నిర్వహించనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 5 వరకు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోండి. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే.

జులై నెలలో ప్రతివారంలో రెండు రోజులు గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు  దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 2024, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష  జరుగనున్నాయి.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. 

జులై 8, 9 తేదీల్లో మొదటి గ్రాండ్‌ టెస్ట్‌
జులై 15, 16 తేదీల్లో రెండో గ్రాండ్‌ టెస్ట్‌
జులై 22, 23 తేదీల్లో మూడో గ్రాండ్‌ టెస్ట్‌
జులై 30, 31 తేదీల్లో నాలుగో గ్రాండ్‌ టెస్టులు ఉంటాయి. 
పైన పేర్కొన్న తేదీల్లో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.